BDK: ప్రతి పేద కుటుంబం సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి భరోసా కల్పిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. శనివారం ఆయన తిరుమలాయపాలెం మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.