RR: ఇందిరమ్మ రాజ్యంలోనే పేదింటి కల నెరవేరిందని చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జ్ భీమ్ భరత్ అన్నారు. షాబాద్ మండలం మాచన్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని భీమ్ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. సొంతింటి కల నెరవేరడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.