SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం కావడంతో భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయం రద్దీగా మారింది. దర్శనంలో ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు. స్వామివారికి అర్చకులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ధర్మగుండంలో స్నానాలు ఆచరించి, కోడెమొక్కులు సమర్పించుకున్నారు.