NRML: పెంబి మండల కేంద్రంలో నిర్వహించే వారాంతపు సంత వేలం పాట ఈనెల 28న నిర్వహించడం జరుగుతుందని పంచాయతీ కార్యదర్శి నరేష్, సర్పంచ్ సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. వేలం పాటలో పాల్గొనాలనుకునే వారు రూ. 10 వేల డిపాజిట్ చేయాలని, గ్రామపంచాయతిలో వారికి సంబంధించి ఎలాంటి బకాయిలు ఉండరాదని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.