»Father Poisoned The Cool Drink Of His Daughters One Dead In Jangaon
Cruel Father :పెళ్లాం మీద కోపంతో కూతుళ్లకు విషం పెట్టిన తండ్రి
భార్య తనను విడిచి వెళ్లిపోవడంతో శీనుకు కోపోద్రిక్తుడయ్యాడు. భార్య లేనప్పుడు పిల్లలు ఎందుకు అనుకున్నాడు. ఎలాగైనా వారిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఏప్రిల్ 6వ తేదీన వారి కోసం కూల్ డ్రింక్ తీసుకొచ్చి.. అందులో విషం కలిపి వారికి ఇచ్చాడు.
Cruel Father : జనగాం(Jangaon) జిల్లా పాలకుర్తిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పెళ్లాం(Wife) మీద కోపంతో కన్న కూతుళ్లకు విషం పెట్టాడో తండ్రి(Father). దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఇద్దరు చిన్నారుల్లో ఒకరు మృతి చెందగా.. మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు.. పాలకుర్తి(Palakurthy) మండలం గూడూరు శివారు జానకిపురంలో పదేళ్ల క్రితం జానకిపురం గ్రామానికి చెందిన గుండె శ్రీను(Srinu)కి అదే మండలంలోని దర్దేపల్లి కి చెందిన ధనలక్ష్మితో పెళ్లయింది. వీరికి ముగ్గురు పిల్లలు కలిగారు. నాగ ప్రియ(9), నందిని(5), రక్షిత్ తేజ్(4). శ్రీను మేస్త్రిగా చేస్తూ కుటుంబాన్ని పోషించుతున్నాడు. పెళ్లి తర్వాత కొద్దికాలం బాగానే ఉన్నా శ్రీను ఆ తర్వాత భార్యను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
భార్యను వేధించిన కేసులో శ్రీను ఒకసారి జైలు(Jail)కు కూడా వెళ్లి వచ్చాడు. అతడి వేధింపులు(Harrasment) భరించలేక ధనలక్ష్మి పిల్లల్ని తీసుకుని పుట్టింటికి పోయింది. ఆ తర్వాత పెద్దమనుషులు పంచాయతి పెట్టి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. ఎప్పటి మాదిరే శ్రీను ప్రవర్తనలో మార్పు రాలేదు. అతనితో తీవ్రంగా విసిగిన భార్య ఇద్దరు కూతుర్లను భర్త దగ్గరే వదిలేసి.. కొడుకు(Son)ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. భార్య తనను విడిచి వెళ్లిపోవడంతో శీనుకు కోపోద్రిక్తుడయ్యాడు. భార్య లేనప్పుడు పిల్లలు ఎందుకు అనుకున్నాడు. ఎలాగైనా వారిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఏప్రిల్ 6వ తేదీన వారి కోసం కూల్ డ్రింక్ తీసుకొచ్చి.. అందులో విషం కలిపి వారికి ఇచ్చాడు. ఆ సంగతి తెలియని ఆ చిన్నారులు ఇద్దరు కూల్ డ్రింకును తాగారు. ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. తర్వాత తానే కూతుర్లిద్దరినీ జనగామ ఆస్పత్రికి తరలించాడు. పెద్ద కుమార్తె నాగ ప్రియ పరిస్థితి విషయమించి.. సోమవారం మరణించింది. చిన్న కూతురు నందిని పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. ఆమెను సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital)కి తరలించారు. విషయం తెలిసిన భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు శ్రీను పై పోలీసులు కేసు నమోదు చేశారు.