»Telangana Ponguleti Srinivasa Reddy And Jupally Krishna Rao Planing To Launch New Party
Ponguleti, Jupally ఇతర పార్టీలోకా? కొత్త పార్టీనా.. పొంగులేటి, జూపల్లి దారెటు
సీఎం కేసీఆర్ పై అసంతృప్తి వారిద్దరిని కలిపింది కానీ వారి మధ్య అంతగా సత్సంబంధాలు లేవు. మరి రాజకీయంగా వారిద్దరూ కలిసి వెళ్తారా? అనేది ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. వారిద్దరూ ఏ రాజకీయ పార్టీలో చేరుతారనేది ఆసక్తికరంగా మారింది. వారికి స్వాగతమంటూ కాంగ్రెస్, బీజేపీ ఆఫర్లు ప్రకటించాయి. కానీ వారిద్దరూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో బీఆర్ఎస్ పార్టీ (Bharat Rashtra Samithi- BRS Party) సస్పెండ్ చేయడంతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy), మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) ప్రస్తుతం ఏ పార్టీలో లేరు. వారు ఏ పార్టీకి మద్దతుగా వ్యవహరించడం లేదు.. కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రం గళం విప్పుతున్నారు. వారికి ఒక వేదిక అంటూ లేదు. సస్పెండ్ (Suspend) వారిద్దరూ ఏ రాజకీయ పార్టీలో చేరుతారనేది ఆసక్తికరంగా మారింది. వారికి స్వాగతమంటూ కాంగ్రెస్, బీజేపీ ఆఫర్లు ప్రకటించాయి. కానీ వారిద్దరూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి తాము పంజరం నుంచి బయటపడ్డామని పేర్కొన్నారు. కానీ తమ భవిష్యత్ కార్యాచరణ అనేది ప్రకటించలేదు. కానీ తమ రాజకీయ భవిష్యత్ కొనసాగాలంటే ప్రస్తుతానికి వారు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. త్వరగా నిర్ణయం తీసుకుంటే వారి ప్రాంతాల్లో మరింత పట్టు కొనసాగించేందుకు సమయం చిక్కుతుంది. అయితే వారిద్దరూ రాజకీయంగా కలిసే ఉంటారా? లేదా విడివిడిగా వెళ్తారా? అనే సందేహాలు వస్తున్నాయి.
ఖమ్మం (Khammam), మహబూబ్ నగర్ (Mahabubnagar)కు చాలా దూరం ఉంది. సీఎం కేసీఆర్ పై అసంతృప్తి వారిద్దరిని కలిపింది కానీ వారి మధ్య అంతగా సత్సంబంధాలు లేవు. మరి రాజకీయంగా వారిద్దరూ కలిసి వెళ్తారా? అనేది ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంట్రాక్టర్, సంపన్నుడు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 8 స్థానాల్లో అభ్యర్థుల ఖర్చంతా చూసుకోగలరు. అందుకే బీఆర్ఎస్ ఒక్క సీటు గెలవనివ్వనని శపథం చేశాడు. అంతటి బలీయమైన శక్తిని తమ వైపునకు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ (Congress)కు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టు ఉండగా.. బీజేపీకి చెప్పుకోదగ్గ నాయకుడు లేడు.. కనీసం అక్కడ పార్టీ పేరే తెలియదు. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో కీలక నాయకుడిగా జూపల్లి కృష్ణారావు ఉన్నా ఆయన పరిధి ఒక్క కొల్లాపూర్ నియోజకవర్గానికే పరిమితం. రెండు, మూడు నియోజకవర్గాల్లో ప్రభావం చూపే శక్తి జూపల్లికి లేదు. కానీ ఐదుసార్లు వరుసగా గెలిచిన చరిత్ర పాలమూరులో ఒక్క జూపల్లికే ఉంది.
వీరిద్దరినీ బీజేపీ చేర్చుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న కమలం పార్టీ బలమైన నాయకులు వస్తే మాత్రం వదులుకోవడం లేదు. గతంలో ఈటల, కొండా, బూర ఇలా పెద్ద పెద్ద నాయకులను చేర్చుకుంది. ఈ క్రమంలోనే పొంగులేటి, జూపల్లిని లాక్కోవాలనే ప్రయత్నాలు చేస్తోంది. అయితే సస్పెండ్ కు గురైన ఈ ఇద్దరు నాయకులు ఏ పార్టీలో చేరాలనుకోవడం లేదని తెలుస్తోంది. సొంతంగా వారే ఒక పార్టీ పెట్టే ప్రయత్నాలు కూడా చూస్తున్నారని సమాచారం. కేసీఆర్ (KCR)కు వ్యతిరేకంగా ప్రస్తుతం ఉన్న ప్రతిపక్షాలు సరైన పాత్ర పోషించడం లేదనే చర్చ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలోనే తామే ఒక పార్టీ పెట్టి కేసీఆర్ తో అన్యాయానికి గురైన నాయకులను చేరదీసి కేసీఆర్ వ్యతిరేక పార్టీగా ఏర్పాటుచేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారని సమాచారం.
కొత్త పార్టీకే మొగ్గు..
పార్టీ పెట్టి బీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీల అసంతృప్తులను చేర్చుకుని బలీయమైన శక్తిగా ఆవిర్భవించాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భావిస్తున్నాడు. ఖమ్మం జిల్లాలో చక్రం తిప్పే పొంగులేటి ఇతరులు కలిసొస్తే ఆయనో పెద్ద లీడర్ గా అవతరించే అవకాశం ఉంది. ఆయన అభిమానులు కూడా సీఎం శ్రీనన్న అంటూ నినాదాలు చేస్తుండడంతో ఆయనకు ముఖ్యమంత్రి కావాలనే కల కూడా ఉంది. అందుకే ప్రత్యేకంగా పార్టీ పెట్టేందుకు యోచిస్తున్నాడు. ఇతర పార్టీల్లో చేరకుండా తామే కొత్త పార్టీ ఏర్పాటుచేసి జూపల్లి లాంటి నాయకులను చేర్చుకుని తెలంగాణలో బలీయ శక్తిగా తయారుకావాలని పొంగులేటి ప్రణాళికలు ఉన్నాయని సమాచారం. ప్రస్తుతానికి వీరిద్దరూ ఏ పార్టీలో చేరకుండా సొంత కుంపటి ఏర్పాటు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారని మాత్రం తెలుస్తున్నది. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.