»Telangana Cm Kcr Another Ramadan Gift To Muslim Minorities
KCR Gift తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త.. ఇది కేవలం మహిళలకే..
దేశంలో మైనార్టీలుగా గుర్తింపు పొందిన ముస్లింలకు భరోసానిస్తూ వారి సంప్రదాయాలు, విశ్వాసాలను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రంజాన్ నిర్వహిస్తోంది. ఇదే బాటలో పేద ముస్లిం మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వారి సంక్షేమానికి పెద్ద పీట వేస్తోంది.
పవిత్ర రంజాన్ పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) ముస్లింలకు కానుకలు అందిస్తోంది. రంజాన్ (Ramadan) పర్వదినం సందర్భంగా వస్త్రాలు కానుకగా అందిస్తుండడంతో పాటు ప్రార్థనా మందిరాల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తోంది. ఈ క్రమంలోనే ముస్లింలకు సీఎం కేసీఆర్ (K Chandrashekar Rao) మరో కానుక అందిస్తున్నారు. అయితే ఇది మహిళలకు (Women) మాత్రమే. పవిత్ర మాసం నేపథ్యంలో పేద మహిళలకు 20 కుట్టు మిషన్లు (Sewing Machines ) అందించాలని నిర్ణయించింది. మైనార్టీలకు అందిస్తున్న పథకాలు, కార్యక్రమాలపై సోమవారం ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణ వచ్చినప్పటి నుంచి మైనార్టీల సంక్షేమానికి (Muslim Minority) రూ.8,581 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో మైనార్టీలుగా గుర్తింపు పొందిన ముస్లింలకు భరోసానిస్తూ వారి సంప్రదాయాలు, విశ్వాసాలను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రంజాన్ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం అధికారికంగా ముస్లింలకు ఇఫ్తార్ విందు (Iftar Party) ఇస్తోంది. ఆడపిల్లల కోసం షాదీ ముబారక్ పథకం అమలు చేస్తోంది. 2022 డిసెంబర్ నాటికి 2,32,713 మంది పెళ్లిళ్లకు రూ.1,903 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం వివరించింది. ఈ పథకం కోసం బడ్జెట్ లో రూ.450 ప్రతిపాదించిన విషయాన్ని గుర్తు చేసింది. ఇక 408 గురుకుల విద్యాలయాలను నెలకొల్పినట్లు, సీఎం విదేశీ విద్య స్కాలర్ షిప్ పథకం కింద మైనార్టీ విద్యార్థుల ఉన్నత చదువులకు రూ.20 లక్షల గ్రాంటు అందిస్తున్నట్లు వెల్లడించింది. ప్రతి సంవత్సరం పేద ముస్లింలకు గిఫ్ట్ ప్యాక్ లను పంపిణీ చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 815 మసీద్ మేనేజ్ కమిటీలకు, ఒక్కో కమిటీకి 500 చొప్పున ఆ గిఫ్ట్ ప్యాకెట్లను ప్రభుత్వం అందించింది.
ఇదే బాటలో పేద ముస్లిం మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వారి సంక్షేమానికి పెద్ద పీట వేస్తోంది. షాదీ ముబారక్ (Shaadi Mubarak), ప్రత్యేక గురుకులాల ప్రారంభం ఇప్పటికే చేపట్టింది. ఇదే బాటలో తాజాగా పేద మహిళలకు 20 వేల కుట్టు మిషన్లు ఉచితంగా అందించాలని నిర్ణయించింది. త్వరలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేసి పంపిణీకి ఉన్నత అధికారులు చర్యలు తీసుకోనున్నారు.