హైదరాబాద్(Hyderabad)లో నకిలీ మహిళా కిలాడీ కానిస్టేబుల్ని పోలీసులు (Police) అరెస్ట్ చేశారు. పోలీస్ కానిస్టేబుల్ నని చెప్పుకుంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మోసాలకు పాల్పడుతున్న ఓ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విలాస జీవితానికి అలవాటు పడిన ఆ యువతి డబ్బు కోసం నకిలీ కానిస్టేబుల్ (fake constable) అవతారం ఎత్తింది. తన పేరు అశ్విని అని, తాను హైదరాబాద్ పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఆర్మ్ డ్ రిజర్వ్ (AR) విభాగంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నానని నమ్మించేది. అందుకు తగినట్టుగా ఓ ఫేక్ ఐడీ కార్డు కూడారూపొందించింది. లంగర్ హౌస్ (Langar House)కు చెందిన నాయక్ అనే వ్యక్తికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అతడి నుంచి రూ.30 వేలు వసూలు చేసింది.
వారాలు గడుస్తున్నా ఉద్యోగంలో చేర్పించకపోవడంతో నాయక్ పోలీసులను ఆశ్రయించాడు. దాంతో పోలీసులు విచారణ జరపగా అమ్మడి భాగోతం బట్టబయలైంది. పోలీసు వేషంలో ఆమె పలువురిని మోసం చేసినట్టు గుర్తించారు. అశ్విని (Ashwini) ముగ్గురు యువకులను ప్రేమించారు. ప్రేమించిన వారిని చోరీలు చేసేలా నకిలీ మహిళా కానిస్టేబుల్ ఉసిగొల్పారు. పోలీస్ యూనిఫారం అడ్డం పెట్టుకొని ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసింది.అభిషేక్(Abhishek) అనే మరో యువకుడిని నకిలీ మహిళా కానిస్టేబుల్ ట్రాప్ చేశారు. తనను పెళ్లి చేసుకోవట్లేదని ఆసిఫ్ నగర్(Asif Nagar) పోలీసులకు నకిలీ మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు.