ASF: సిర్పూర్ టీ మండల కేంద్రంలో సోమవారం ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా అట్టహాసంగా కార్యక్రమాలు నిర్వహించారు. సిర్పూర్ రేంజ్ అధికారి(FRO) ఇక్బాల్ హుస్సేన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, అటవీశాఖ అధికారులు భాగస్వామ్యంతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సందర్భంగా వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ రక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.