NLG: తవక్లాపూర్లో నెల రోజుల్లో ఐదుగురు మృతి చెందడంతో మాజీ సర్పంచ్ పొన్నగంటి అలివేలు కృష్ణయ్య బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. ఒక్కో కుటుంబానికి రూ.3 వేల చొప్పున మొత్తం రూ.15 వేలు ఇచ్చారు. బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆపదలో అండగా నిలిచిన ఆయనకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు పాల్గొన్నారు.