PDPL: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను ముందుకు తీసుకువెళ్తామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మంథనిలో ఇవాళ మంత్రి పొన్నంతో కలిసి బస్టాండ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాయకత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.