ADB: సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ గవాయ్‌పై జరిగిన దాడి గర్హనీయమని MRPS మండల అధ్యక్షుడు శంకర్ అన్నారు. నేరడిగొండ మండల కేంద్రంలో నాయకులు శుక్రవారం సమావేశమై నిరసన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన రాకేష్ కిషోర్‌ను కఠినంగా శిక్షించాలన్నారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నాయకులు రవి, సంతోష్, ఆడేల్లు, గంగాధర్, తదితరులున్నారు.