MDK: 42% రిజర్వేషన్లపై ఎన్నికలు నిర్వహించవద్దని సుప్రీంకోర్టు, హైకోర్టు సూచించింది. దీంతో ప్రభుత్వం రిజర్వేషన్లు మార్చి ఎన్నికలకు ముందుకు వెళుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి.. డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తుంది.