MNCL: గ్యాస్ సిలిండర్‌కు అదనంగా డబ్బులు తీసుకుంటున్న బెల్లంపల్లి పట్టణంలోని అరవింద్ గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని జిల్లా పౌర సరఫరాల అధికారికి MCPIU నాయకులు గురువారం ఫిర్యాదు చేశారు. నాయకులు వెంకటేష్ మాట్లాడుతూ.. రూ.877 ఉన్న గ్యాస్‌కు రూ.880 తీసుకొని చిల్లర డబ్బులు ఇవ్వటం లేదన్నారు. 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నవారికి ఫ్రీ డెలివరీ చేయాలన్నారు.