GNTR: ఊపిరితిత్తుల పనితీరు తగ్గడంతో గాలి పీల్చడానికి ఇబ్బందిగా మారి నిత్యం నరక వేదన అనుభవిస్తున్న ఓ యువకుడిని గుంటూరు తూర్పు MLA నజీర్ ఆసుపత్రిలో జాయిన్ చేయగా, జీజీహెచ్ క్యాన్సర్ విభాగం వైద్యుల బృందం ప్రాణం పోసింది. గుంటూరు జీజీహెచ్లో సంక్లిష్టమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు సూపరింటెండెంట్ ఎస్ఎస్వీ రమణ వెల్లడించారు.