KNR: బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపు పట్ల కరీంనగర్ బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టపాసులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేతలు మాజీ మేయర్ సునీల్ రావు, మాజీ డిప్యూటీ మేయర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిలపు రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.