MBNR: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సిబ్బంది లంచాలకు మరిగారు. పట్టణంలోని జనరల్ ఆసుపత్రికి గురువారం ఓ వ్యక్తి దెబ్బ తగలడంతో వెళ్లాడు. ఆస్పత్రి సిబ్బంది కట్టుకట్టకుండా 500 రూపాయలు ఫోన్ పే చేస్తే కట్టు కడతారంటూ వెల్లడించారు. కాన్పుల వార్డులో అబ్బాయి పుడితే ఒకరకమైన లంచం, అమ్మాయి పుడితే ఒక రకమైన లంచం అడుగుతూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు.