తిరుపతి: నాయుడుపేట మున్సిపాలిటీ నిరుద్యోగులు కౌశలం సర్వేను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కౌశలం సర్వే 10వ తరగతి నుంచి ఆపై చదువుకున్న ప్రతి ఒక్కరు కౌసల్య సర్వేను చేయించుకోవాలని తెలిపారు. 50 సంవత్సరాల లోపల చదువుకున్న ప్రతి ఒక్కరు సచివాలయంలో కౌశలం సర్వే చేయించుకోవాలన్నారు.