NDL: కోయిలకుంట్ల పట్టణంలో ఇవాళ ప్రజాసంఘాల నాయకులు నిరసన తెలియజేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై సుప్రీంకోర్టులో రాజేష్ కిషోర్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ప్రధాన న్యాయమూర్తి పై దాడికి పాల్పడ్డ రాజేష్ కిషోర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.