KMM: సంక్రాతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఖమ్మం మీదుగా మరో ఐదు రైళ్లు నడవనున్నాయని సీసీటీవో రాజగోపాల్ తెలిపారు. జనవరి 8న కాకినాడ-వికారాబాద్ (07460), సికింద్రాబాద్-పార్వతీపురం (07464), 9, 10 తేదీల్లో వికారాబాద్-పార్వతీపురం(07461), 105 పార్వతీపురం- వికారాబాద్(07462) రైళ్లు నడుస్తాయని, అవసరమైన వారు రిజర్వేషన్ చేసుకోవాలని కోరారు.