KMM: గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా, ఖమ్మం రూరల్ మండలంలోని నామినేషన్ పత్రాల స్వీకరణ కేంద్రాన్ని రూరల్ సీఐ మధు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ వేసే అభ్యర్థుల వెంట ముగ్గురు వ్యక్తులు మాత్రమే వెళ్లాలని సూచించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీఐ మధు హెచ్చరించారు.