GDWL: మానవపాడు మండలం బోరవెల్లి స్టేజి సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హైవే కూలీ మృతి చెందాడు. హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్తున్న నంద్యాల డిపోకు చెందిన బస్సు, రోజువారీగా పనిచేస్తున్న కూలీలపై ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనంతపురం గ్రామానికి చెందిన గోవిందు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.