GNTR: మంగళగిరి మండలం నవులూరుకు చెందిన కొత్తమాసు మౌనిక అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆమెకు సహాయం కోసం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై స్పందించిన మంత్రి లోకేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.5 లక్షల ఎల్ఓసీని మంజూరు చేయించారు. మంగళవారం టీడీపీ నేతలు బాధితురాలి ఇంటికి వెళ్లి ఎల్ఓసీని అందజేశారు.