NLG: రాష్ట్రస్థాయి ఉడ్ బాల్ పోటీల్లో చండూరు మరియానికేతన్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. భద్రాది కొత్తగూడెంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాఠశాల విద్యార్థులు 3 బంగారు పతకాలు, 2 రజత పతకాలు సాధించి ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను గురువారం పాఠశాల కరస్పాండెంట్, ఉపాధ్యాయులు అభినందించారు.