NZB: ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహరాజ్ చేపట్టిన మా భూమిలక్ష కిలోమీటర్ల రథయాత్ర విజయవంతం చేయాలని డీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంత్ కోరారు. శనివారం మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈనెల 14న ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభం అవుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు బహుజన రాజ్య స్థాపన లక్ష్యంగా యాత్ర కొనసాగుతుందన్నారు.