BDK: టేకులపల్లి మండలం బొమ్మనపల్లి మండల పరిషత్ పాఠశాలలో శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. వంటగదిలో వంట మనిషి సరోజ వంట చేస్తుండగా, స్లాబ్ పెచ్చులు ఊడిపడటంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనను గమనించిన పాఠశాల సిబ్బంది ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పాఠశాల భవనం మరమ్మత్తుల లోపం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.