PLD: ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పీఎం ఎఫ్ఎంఈ స్టేట్ ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ జనార్దన్ రావు తెలిపారు. శనివారం నరసరావుపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. పరిశ్రమలకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా 35 శాతం సబ్సిడీపై రుణ సదుపాయం కలిపిస్తుందన్నారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.