NZB: బైకును బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు తీవ్రగాయాలై మృతిచెందిన ఘటన ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివారులోని అలీసాగర్ లిఫ్ట్ వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. బోధన్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎడపల్లి నుంచి జానకంపేట వైపు వెళ్తున్న బైకును ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న పిట్ల గంగాధర్ గాయాలయ్యాయి. 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.