ELR: అక్రమంగా డీసీఎం వ్యాన్లో తరలిస్తున్న మారుజాతి కలపను సీజ్ చేసినట్లు ఎఫ్ఎస్వో బి.దినేష్ తెలిపారు. శనివారం తెల్లవారు జామున ప్రత్తిపాడు నుంచి కొయ్యలగూడెం వస్తుండగా స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుకున్న కలప విలువ సుమారు రూ.25వేలు ఉంటుందన్నారు. వాహనాన్ని కన్నాపురం అటవీశాఖ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు.