WGL: వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శనివారం హెచ్చరిక జారీ చేస్తూ, మద్యం సేవించి వాహనం నడపడం నేరమని, అలా చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం సేవించిన వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని, కొన్ని సందర్భాల్లో వారే మృత్యువాత పడుతున్నారని తెలిపారు. దీంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.