MHBD: తొర్రూరు మండలం జమస్థాపురం రూపతండాలో శనివారం విద్యుదాఘాతంతో ఎద్దు మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. రైతు భూక్య రవి పొలంలో ఎద్దులను మేపుతుండగా, ఒక ఎద్దు ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. జీవనాధారాన్ని కోల్పోయానని రైతు కన్నీటితో వాపోయారు. ప్రభుత్వం ఆయనను ఆదుకోవాలని రైతు కోరారు.