కృష్ణా: గుడివాడలో వ్యభిచార గృహంపై రూరల్ పోలీసులు దాడి చేశారు. తాలూకా పోలీసే స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహం నడుస్తోందన్న సమాచారం మేరకు రూరల్ ఎస్సై ఎన్.చంటిబాబు సిబ్బందితో దాడి చేశారు. ఇంటి యజమాని యలవర్తి లక్ష్మీ, జోసెఫ్, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. 2 సెల్ ఫోన్లు, బైక్, 2 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.