లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ మోస్తరు స్కోరు చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఓపెనర్లు హాఫ్ సెంచరీతో రాణించడంతో ఓ దశలో 200 ప్లస్ పరుగులు చేసేలా కనిపించినా.. LSG బౌలర్లు వరుస వికెట్లతో స్కోరును కట్టడి చేశారు. గిల్, సుదర్శన్ హాఫ్ సెంచరీలతో రాణించారు. శార్దూల్, బిష్ణోయ్ తలో 2 వికెట్లు పడగొట్టారు. LSG టార్గెట్ 181.