MNCL: కన్నెపల్లి మండలం రెబ్బల గ్రామ శివారులో సర్వే నెంబర్ 248లో గల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు SI గంగారం శనివారం తెలిపారు. మండల MRO ఫిర్యాదు మేరకు చేసిన విచారణలో అక్రమంగా, ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిలో ప్రవేశించి చెట్లను నరికి వేసినారని తెలిందన్నారు. దీంతో 7గురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామన్నారు.