HNK: జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం రాత్రి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈనెల 27న జరగనున్న పార్టీ రజతోత్సవ వేడుకల సన్నాహాక సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అధ్యక్షతన మహాసభను విజయవంతం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, జిల్లా నాయకులు పాల్గొన్నారు.