MDCL: బోడుప్పల్ నుంచి చిల్కానగర్ వెళ్లే మార్గంలో నిత్యం వేలాదిమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ రహదారిపై రోజురోజుకు ట్రాఫిక్ భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 30 అడుగుల వెడల్పుతో ఉన్న రోడ్డును 100 ఫీట్ల వరకు విస్తరించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రోడ్డు విస్తరణ పూర్తయితే వాహనాల రద్దీ తగ్గనుంది.