KMM: పోలీస్ శాఖలో 9 ఏళ్లుగా విశేష సేవలందించిన పోలీసు జాగిలం యామి (ఫిమేల్ డాగ్) అనారోగ్యంతో మృతి చెందింది. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచనల మేరకు పోలీస్ అధికారులు పుష్పగుచ్చాలు వేసి నివాళులర్పించారు. అనంతరం అధికారిక లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. యామి (జాగిలం) లబ్రాడార్ రిట్రీవర్ సంతతికి చెందింది.