KMR: రామారెడ్డి మండలం ఉప్పల్ వాయి గ్రామ శివారులోని ఇటుక బట్టి వద్ద సీఆర్పీ మహమూద్ బడి ఈడు పిల్లల సర్వే చేపట్టారు. పదిమంది బడిఈడు పిల్లలను గుర్తించారు. ఈ పిల్లల కోసం ఆవాస ప్రాంత పాఠశాల ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు పిల్లల వివరాలు పంపించినట్లు మండల విద్యాశాఖ అధికారి ఆనందరావు తెలిపారు. పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.