ADB: పోలీసుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని రాష్ట్ర అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంజయ్ కుమార్ అన్నారు. నిన్న జిల్లాలోని 2వ బెటాలియన్లో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి పనులను కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ప్రారంభించారు. పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో ఎదుర్కొనే ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని, వారికి మెరుగైన వసతులు కల్పించడం జరుగుతుందని తెలిపారు.