MNCL: లక్షెట్టిపేట మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మండలంలోని తలమల నుంచి పెద్దంపేట అటవీ సెక్షన్ వరకు పులి అడుగులను గురువారం అధికారులు గుర్తించారు. దీంతో అటవీ శివారు గ్రామాల ప్రజలో ఆందోళన నెలకొంది. పులి సంచరిస్తున్నందున ప్రజలు, రైతులు అటవీ ప్రాంతానికి వెళ్లవద్దని అటవీ అధికారులు సూచించారు.