SDPT: దుబ్బాక పురపాలిక పరిధిలోని చేరువాపూర్ వార్డులో మంగళవారం ఉదయం నీరు లేని పాత బావిలో ప్రమాదవశాత్తూ పడిపోయిన వృద్ధుడిని స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో బావిలోంచి అరుపులు విన్న రైతులు పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఫైర్ ఇంజిన్ సహాయంతో వృద్ధుడిని స్వల్ప గాయాలతో బయటికి తీశారు.