సంగారెడ్డి: బీజేపీ సీనియర్ నాయకుడు దోమడుగు రమేష్ ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసి, మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు శుక్రవారం జిన్నారం మండలంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రమేష్ మరణంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబానికి ధైర్యం చెప్పారు. పార్టీకి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు.