WNP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక స్టేను చూసి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఆశావహులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ఇందుకు సంబంధించి పార్టీపరమైన స్పష్టత రెండు రోజుల్లో రాబోతోందని ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. అవసరమైతే పార్టీ పరంగా 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్లేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధంగా ఉందన్నారు.