BDK: మణుగూరు పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటనపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. శనివారం ఎస్పీని కలిసి సీఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటువంటి అధికారులు పోలీస్ శాఖలో ఉండటం వల్ల శాఖకు చెడ్డ పేరు వస్తుందన్నారు. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.