NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో వస్తున్న వరద ప్రవాహాన్ని శుక్రవారం సాయంత్రం 4 గంటల తర్వాత ఏ సమయంలోనైనా స్పిల్‌వే గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఎస్ఈ జగదీశ్ తెలిపారు. గోదావరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పశువుల కాపరులు, మత్స్యకారులు, రైతులు నదిని దాటేందుకు ప్రయత్నించవద్దన్నారు.