KMM: కొణిజర్ల మండలం పల్లిపాడు- ఏన్కూరు మార్గంలో గురువారం రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని స్థానికులు తెలిపారు. తీగల బంజారా సమీపంలో పగిడేరు వంతెన పైనుంచి ప్రవహిస్తుండడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. అటు ఇరువైపులా అధికారులు ఎవరూ వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు. ప్రజలు గమనించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు.