NLG: సీపీఐ సీనియర్ నేత వడ్డేమాన్ నారయ్య మృతి సీపీఐ కి తీరని లోటని, ఆయన ఆశయాలను సాధించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీపీఐ జాతీయ సమితి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి అన్నారు. డిండి మండలం ఖానాపూర్ లో నారయ్య మృత దేహంపై ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ఎర్రజండాను కప్పి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంతిమ యాత్రలో పాల్గొన్నారు.