MNCL: బెల్లంపల్లి శాంతిఖని బొగ్గు గనిలో అధికారుల వేధింపులను భరించలేక మాధవ్ అనే మల్టీ జాబ్ వర్కర్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఇటీవల మాధవ్‌కు గనిలో స్వల్ప ప్రమాదం జరగగా ఘటనలో గాయపడిన మాధవ్‌ను అధికారులు సస్పెండ్ కూడా చేశారు. ఇదేంటని అధికారులకు మాధవ్ ఎదురు తిరగడంతో అప్పటినుంచి సదరు కార్మికుడిని అధికారులు వేధిస్తున్నారని తెలుస్తుంది.