GDWL: రాజకీయ లబ్ధి కోసం వార్డుల వారీగా ఓట్లను తారుమారు చేసిన కొంతమంది అధికారులపై కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి అని అఖిల పక్ష నాయకులు పేర్కొన్నారు. సోమవారం వడ్డేపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఓటర్ల జాబితాలోని అవకతవకలపై అఖిల పక్ష నాయకులు మున్సిపల్ కమిషనర్ సొంటి రాజయ్యకు వినతిపత్రం అందజేశారు. వినతిపై మున్సిపల్ కమిషనర్ సానుకూలంగా స్పందించారన్నారు.