JGL: అనారోగ్య కారణంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ముత్తునూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సంఘ శరత్ కుమార్ (23) సంవత్సరం నుంచి ఛాతిలో నొప్పితో బాధ పడుతుండేవాడు. పలుమార్లు ఆస్పత్రికి వెళ్లినా నొప్పి తగ్గకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.